మరో ఘనతకు చేరువలో హార్దిక్ పాండ్యా..ఈ సారి బుమ్రా రికార్డుకు ఎసరు

మరో ఘనతకు చేరువలో హార్దిక్ పాండ్యా..ఈ సారి బుమ్రా రికార్డుకు ఎసరు

మరికొద్ది గంటల్లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 జరగబోతుంది. తొలి టీ20లో ఓడిన భారత జట్టు..ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచులో టీ20 కెప్టెన్ హార్దిక పాండ్యా టీమిండియా పేసర్ బుమ్రా రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచులో పాండ్యా బుమ్రా సాధించిన ఓ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. ఈ రికార్డును బ్రేక్ చేస్తే పాండ్యా నాల్గో స్థానానికి చేరుకుంటాడు. 

బుమ్రా రికార్డు ఏంటంటే..

టీమిండియా తరపున బుమ్రా ఇప్పటి వరకు 60 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 70 వికెట్లు పడగొట్టాడు. అటు 88 టీ20 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ కూడా 70 వికెట్లు తీశాడు. దీంతో వికెట్ల పరంగా ఇద్దరు సమానంగా ఉన్నారు. ఈ మ్యాచులో హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ తీస్తే చాలు..బూమ్రాను అధిగమిస్తాడు. వీరిద్దరు ప్రస్తుతం భారత తరపున అత్యధిక టీ20 వికెట్లు తీసిన ఆటగాళ్ల స్థానంలో 4వ స్థానంలో ఉన్నారు. ఇవాల్టి  మ్యా్చ్‌లో ఒక్క వికెట్ తీస్తే బూమ్రా 5వ స్థానంలో..పాండ్యా 4వ స్థానంలో ఉంటారు. 

అగ్రస్థానంలో అతడే..

టీమిండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో  చాహల్ టాప్ లో ఉన్నాడు. అతను 76 టీ20 మ్యాచుల్లో 93 వికెట్లు పడగొట్టాడు. చాహల్ తర్వాత భువనేశ్వర్ రెండో స్థానంలో ఉన్నాడు. భవీ 87 మ్యాచుల్లో 90 వికెట్లు సాధించాడు. వీరి తర్వాత అశ్విన్ 87 మ్యాచుల్లో 90 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.