
హార్దిక్ పాండ్యా కొత్త సంవత్సరం సందర్భంగా నటాసా స్టాంకోవిక్‌తో తనకున్నసంబంధాన్నిబయటపెట్టాడు. గత కొంత కాలంగా హార్దిక్, నటాసాల డేటింగ్ గురించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటన్నింటిని నిజం చేస్తూ.. పాండ్యా నటాసాతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నాడు. నేను నా కొత్త సంవత్సరాన్ని ఇలా ప్రారంభిస్తున్నానంటూ పాండ్యా ఫోటోతో పాటూ రాశాడు.
పాండ్యా ఇది పోస్టు కాసేపటికే, పాండ్యా మరదలు పంఖురి శర్మ మొదటగా స్పందించారు. పాండ్యా వెన్నునొప్పి కారణంగా సెప్టెంబర్ 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే పాండ్యా ఆ నొప్పి నుంచి కోలుకుంటున్నాడు. పాండ్యా వచ్చే నెలలో ఇండియా ‘ఎ’తరపున న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ, శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు మరియు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలకు ఎంపిక కాలేదు.