ఆస్ట్రేలియా సిరీస్ నుంచి పాండ్యా ఔట్

ఆస్ట్రేలియా సిరీస్ నుంచి పాండ్యా ఔట్

వెన్నునొప్పి కారణంగా ఆస్ట్రేలియా సిరీస్ నుండి వైదొలిగాడు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఆదివారం నుండి ఆసిస్ తో రెండు టీ20, ఇదు వన్డేల సిరీస్ ను భారత్ ఆడనుంది. సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న పాండ్యాకు వెన్ననొప్పి రావడంతో విశ్రాంతినిచ్చినట్టు బీసీసీఐ తెలిపింది. గత ఏడాది.. ఆసియా కప్ లో భాగంగా.. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ వేస్తున్న పాండ్య కు తీవ్రమైన వెన్ననొప్పి వచ్చింది..దీంతో  ఒవర్ మధ్యలోనే పెవీలియన్ కు చేరాడు. ప్రస్తుతం అదే వెన్ననొప్పి తిరగబెట్టడంతో ఆస్ట్రేలియా టూర్ కు పాండ్యా దూరమయ్యాడు.

పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపారు బీసీసీఐ అధికారులు. వెన్నముక గాయంతో పాండ్యా బాధపడుతున్నాడని అతనికి రెస్ట్ అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ తెలిపింది. దీంతో అతను బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడు.