ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లకు పాండ్యా దూరం!

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా  సిరీస్ లకు పాండ్యా దూరం!

బంగ్లాదేశ్ తో జరిగిన  మ్యాచ్ లో గాయపడి వరల్డ్ కప్ మిగితా మ్యాచ్ లకు దూరమైన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్ లకు కూడా దూరం కానున్నాడని తెలుస్తుంది.   చీలమండ గాయం కారణంగా కనీసం మరో రెండు నెలల పాటు పాండ్య  ఆటకు దూరం కానున్నాడని, దీంతో   ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్ లకు పాండ్యా దూరం కానున్నాడని  సమాచారం.   

ALSO READ: పాక్‌‌ టీమ్‌‌ డైరెక్టర్‌‌గా మహ్మద్‌‌ హఫీజ్‌‌
 

ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్  2023 నవంబర్ 23 వైజాగ్‌లో ప్రారంభమవుతుంది.  తదుపరి నాలుగు మ్యాచ్‌లు వరుసగా నవంబర్ 26, 28, డిసెంబర్ 1, 3 న తిరువనంతపురం, గౌహతి, నాగ్‌పూర్, హైదరాబాద్‌లలో జరుగనున్నాయి.  ఇక డిసెంబరు 10, 12, 14 తేదీలలో దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు టీ 20 మ్యాచ్ లు ఆడనుంది.  ఇందుకోసం భారత్ దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది.  అక్కడ వన్డేలు, టెస్టులు ఆడనుంది.