కళాకారులను దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ మంత్రి హరీశ్ రావు

కళాకారులను దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: నమ్మినోళ్లను నట్టేటముంచడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మించినోళ్లు లేరని, కళాకారులను దగా చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి వెయ్యి మంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, మూడేళ్లు గడిచినా ఆ హామీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళాకారులు నిలదీస్తే.. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఎక్స్ వేదికగా రవీంద్ర భారతీలో మంత్రి జూపల్లిని కళాకారులు అడ్డుకున్న వీడియోలను పోస్టు చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ మంత్రులు ఎన్నాళ్లు ఇలా తప్పించుకు తిరుగుతారని ప్రశ్నించారు. ‘డైవర్షన్ రాజకీయాలు.. ఊక దంపుడు డైలాగులతో ఇంకెన్నాళ్లు ప్రజలను మభ్యపెడతారు రేవంత్ రెడ్డి?  కళాకారుల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి మంచిది కాదని’ అని హితవు పలికారు.