ఒకటో తేదీన జీతాలపై కాంగ్రెస్ మాట తప్పింది : హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

ఒకటో తేదీన జీతాలపై కాంగ్రెస్ మాట తప్పింది :  హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు అన్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం మాట తప్పిందన్నారు. గత డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు అందలేదని బుధవారం ఆయన ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. అలాగే, మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు కూడా పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని, వెంటనే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు.