ఇది కక్ష సాధింపే కాంగ్రెస్..కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది: హరీశ్ రావు

ఇది కక్ష సాధింపే కాంగ్రెస్..కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది: హరీశ్ రావు
  • అక్రమ కేసులతో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఫైర్

హైదరాబాద్, వెలుగు: ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. ఫార్ములా–ఈ రేసు విషయంలో కాంగ్రెస్​సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండేండ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నదని విమర్శించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఫార్ములా–ఈ కేసులో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విచారించేందుకు గవర్నర్​అనుమతినిచ్చిన నేపథ్యంలో హరీశ్​సహా పలువురు బీఆర్ఎస్​ నేతలు స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని హరీశ్ అన్నారు. ‘

‘హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌‌‌‌‌‌‌‌ని పెంచిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని సీఎం రేవంత్​లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ఆయనపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకే ఇలాంటి చిల్లర డ్రామాలకు తెరతీశారు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పార్టీ కేడర్​ అంతా అండగా ఉంటుంది. సీఎం​ దుర్మార్గ వైఖరిని న్యాయ పరంగానే ఎదుర్కొంటాం” అని పేర్కొన్నారు. 

కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీసేందుకే: సురేశ్ రెడ్డి  

కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాజకీయంగా బలహీనపరచాలన్న ఉద్దేశంతోనే ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌కు గవర్నర్ అనుమతిచ్చారని బీఆర్ఎస్​ ఎంపీ కేఆర్ ​సురేశ్ ​రెడ్డి అన్నారు.  గురువారం ఆయన తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో యూత్​ఐకాన్‌‌‌‌‌‌‌‌గా కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పేరుంది. 

ఆయనకు ఉన్న ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నది. ప్రాంతీయ పార్టీల బలాన్ని తగ్గించడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయి” అని ఆరోపించారు. ఫార్ములా–ఈ కేసు కాంగ్రెస్ పార్టీకి సెల్ఫ్ గోల్ అవుతుందని వ్యాఖ్యానించారు. 

చోటా భాయ్ అడగ్గానే అనుమతి: వద్దిరాజు 

కేటీఆర్ ​ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌కు చోటా భాయ్ (రేవంత్) అడగ్గానే బడే భాయ్ (మోదీ) అనుమతిచ్చారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ‘‘ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే మూడుసార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. లై డిటెక్టర్ టెస్టుకూ సిద్ధమని ఆయన ప్రకటించారు. కానీ, ప్రజలకు సమాధానం చెప్పలేక సీఎం డైవర్షన్ పాలిటిక్స్‌‌‌‌‌‌‌‌కు తెరలేపారు” అని విమర్శించారు.  

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైనయ్: గంగుల 

సీఎం రేవంత్ ​రెడ్డి ఆదేశాలను గవర్నర్ పాటించారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ ఆరోపించారు. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను అణగదొక్కాలని కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని అన్నారు. రేవంత్ రాత్రి బీజేపీతో దోస్తీ చేసి, పొద్దున లేచి కాంగ్రెస్ అంటారని విమర్శించారు. ఫార్ములా–ఈ రేసులో డబ్బులు ఎక్కడా వృథా కాలేదన్నారు. 

కాంగ్రెస్, బీజేపీ కలిసి కౌరవుల్లా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌పై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేసేందుకు రేవంత్, బీజేపీ నేతలు కలిసి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​ రెడ్డి ఆరోపించారు. ఈ కేసు పూర్తిగా కల్పితమని, ప్రతీకార కుట్ర అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​ అన్నారు.