హైదరాబాద్‌‌‌‌ హెరిటేజ్‌‌‌‌ రన్‌‌‌‌... చార్మినార్‌‌‌‌ టు కుతుబ్‌‌‌‌ షాహీ టూంబ్స్‌‌‌‌ వరకు పరుగు

హైదరాబాద్‌‌‌‌ హెరిటేజ్‌‌‌‌ రన్‌‌‌‌... చార్మినార్‌‌‌‌ టు కుతుబ్‌‌‌‌ షాహీ టూంబ్స్‌‌‌‌ వరకు పరుగు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నగరవాసుల్లో ఆరోగ్య స్పృహను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ర్యాపిడో హైదరాబాద్‌‌‌‌ హెరిటేజ్‌‌‌‌ రన్‌‌‌‌-2026 విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ర్యాపిడో సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్​ రంజన్, టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి,  ర్యాపిడో వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ శ్రావ్య రెడ్డి ప్రారంభించారు.  

ప్రజలు, ప్రాంతాలు, లక్ష్యాలను అనుసంధానించే మొబిలిటీ అనే ఇతివృత్తంతో సాగిన ఈ పరుగులో విద్యార్థులు, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ఔత్సాహికులు వేలాదిగా పాల్గొన్నారు.   చార్మినార్‌‌‌‌ వద్ద ప్రారంభమైన 21 కిలోమీటర్ల హాఫ్‌‌‌‌ మారథాన్‌‌‌‌.. కుతుబ్‌‌‌‌షాహీ టూంబ్స్‌‌‌‌ వద్ద ముగిసింది. కార్యక్రమానికి అపోలో ఆస్పత్రి అధికారిక మెడికల్ పార్టనర్‌‌‌‌గా వ్యవహరించి అత్యవసర వైద్య సేవలను అందుబాటులో తీసుకొచ్చింది. 

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌‌‌‌ను పెంచేలా హెరిటేజ్ రన్‌‌‌‌ను ఏటా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్​ రంజన్ ప్రకటించారు. తొలి ఎడిషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, ఈ ఉత్సాహంతోనే ర్యాపిడో సంస్థతో కలిసి రాబోయే ఐదేండ్లపాటు ఈ రన్‌‌‌‌ను కొనసాగించేలా ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.