హైదరాబాద్ లో 138 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్

హైదరాబాద్ లో 138 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్

బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న 138 ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ నియామకాల్లో తెలంగాణకు చెందిన మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ సిబ్బంది, రిటైర్డ్ పోలీస్ సిబ్బందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల వయోపరిమితి జనవరి 31 నాటికి మాజీ సైనికులకు 58 ఏండ్లు, ఇతరులకు 62 ఏండ్ల లోపు ఉండాలి. 

ఎంపికైన వారికి నెలకు రూ. 26,000 గౌరవ వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు (డిశ్చార్జ్ బుక్, ఆధార్, పాన్ కార్డ్, ఇతర గుర్తింపు పత్రాలు), మూడు పాస్​పోర్ట్ సైజు ఫొటోలతో మార్చి 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పెట్లబుర్ట్​లోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.