- కాంగ్రెస్ నేత శాం పిట్రోడా కామెంట్
వాషింగ్టన్: ఇతరులకు ఉపయోగపడేందుకే మన దేశ యువత ట్యాలెంట్ సరిపోతున్నదని ఇండియన్ ఓవర్ సీస్ కాంగ్రెస్ చీఫ్ శాం పిట్రోడా అన్నారు. 150 కోట్ల జనాభా ఉన్నా మన దేశానికి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ లేదన్నారు. ఒక యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ భారీఎత్తున యంగ్ ట్యాలెంట్ ను సృష్టించినా సొంత అవసరాలు, ఆవిష్కరణల కోసం ఆ ట్యాలెంట్ ను వాడుకోలేకపోయిందన్నారు. చివరకు ఆ ప్రతిభ అంతా విదేశీ కంపెనీలకు ఉపయోగపడిందని చెప్పారు.
ప్రోగ్రామింగ్, బ్యాంకింగ్, లీగల్ సిస్టమ్, ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో భారతీయ యువత ప్రతిభను వాడుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇండియా సొంతంగా గ్లోబల్ స్కేల్ టెక్నాలజీ ప్రాడక్టులను తయారు చేయలేకపోయిందన్నారు. ‘‘మనకు ఒక సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫాం లేదు. మైక్రోసాఫ్ట్ లాగా మనం ఒక పెద్ద కంపెనీని ప్రారంభించలేదు. కనీసం సొంత ఆపరేటింగ్ సిస్టం కూడా మనకు లేదు. చివరికి మొబైల్ ఫోన్లకు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ను మనం డెవలప్ చేయలేదు. ఇది సిగ్గుపడాల్సిన విషయం” అని పిట్రోడా వ్యాఖ్యానించారు.
లష్కరే కాంగ్రెస్ దేశాన్ని అవమానించింది: బీజేపీ
శాం పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. లష్కరే కాంగ్రెస్ చీఫ్ అడ్వైజర్ మళ్లీ తన అబద్ధాలతో భారత్ పై విషం చిమ్మారని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’ లో అన్నారు.
