- అయినా సీఎం రేవంత్‌కు ఉలుకూ.. పలుకూ లేదు: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: గురుకులాలు, యూనివర్సిటీల్లోని హాస్టళ్లలో భోజనం బాగుండడం లేదని రోజూ ఎక్కడో ఒక చోట విద్యార్థులు రోడ్డెక్కు తున్నారని, అయినా కూడా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌కు ఉలుకూ.. పలుకూ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. గురుకులాల్లో నెలకొన్న అధ్వానపరిస్థితులపై సీఎంకు సమీక్షించే తీరిక దొరకకపోవడం దారుణమని గురు వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయినా సీఎం రేవంత్‌కు ఉలుకూ.. పలుకూ లేదు: హరీశ్ రావు
గురుకులాల ప్రతిష్టను దెబ్బతీసిన రేవంత్.. కమీషన్లు దండుకోవడానికే యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట భారీ నాటకానికి తెరదీశారని ఆరోపిం చారు. పిల్లలకు మంచి భోజనం పెట్టలేని ప్రభుత్వం, అంతర్జాతీయ వసతులు కల్పిస్తుందనుకోవడం భ్రమే అవుతుందన్నారు.
