సబ్జెక్ట్ లేక సీఎం రేవంత్ పసలేని ఆరోపణలు చేస్తున్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు

సబ్జెక్ట్ లేక సీఎం రేవంత్ పసలేని ఆరోపణలు చేస్తున్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు

కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా నీటి ప్రాజెక్టులకు బోర్డుకు అప్పగించలేదని మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మా నీటివాటా తేల్చాలని షరతు పెడితే వాటికి అంగీకరించేదు కాబ్టటే ఆనాడు ప్రాజెక్టులు బోర్టుకు అప్పగించలేదని హరీశ్ రావు అన్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విసృతస్ధాయి సమావేశానికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. నీటి ప్రాజెక్టుల బోర్డు వీలీనంపై సీఎం చేసిన వ్యాఖ్యలను హరీశ్ ఖండించారు సీఎం స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ లేకుండా చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మాపై సీఎం పసలేని ఆరోపణలు చేస్తున్నారని వాటికి అసెంబ్లీలో దిమ్మతిరిగే సమాధానాలు చెబుతామని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు.

ఎల్బీ నగర్ సమావేశానికి ముందు హరీశ్ రావు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని జీయంఆర్ ఫంక్షన్ హల్ లో ఆదివారం ఉదయం జరిగిన  మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. 1.8 శాతం(నాలుగున్నర) లక్షల ఓట్ల తేడాలోనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెల పెన్షన్లు ఎగరగొట్టి 48లక్షల మంది పేదల కడుపు కొట్టిందని ఆరోపించారు. తీపి,చేదుల కలయికగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యం తెచ్చుకోని బయటకు రావాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావని మమతా బెనర్జీ చెప్పడం చూస్తుంటేనే ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతుందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రైతులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్ధితులు రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి 6 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డుపైకి ఈడ్చిందని అన్నారు. గుడిలో దేవున్ని రాజకీయం చేయటం మంచిది కాదని. అయోద్యలో రామమందిర నిర్మాణాన్ని రాజకీయం కోసం బిజేపి వాడు కోవటం ఘోరమని కేంద్రాన్ని దుయ్యబట్టారు. తెలంగాణలో లోక్ సభ స్థానాల్లో బిజెపి, కాంగ్రెస్ ఏ పార్టీ గెలిచినా ప్రయోజనం లేదని హరీశ్ రావు అన్నారు.