హరీశ్​..రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

హరీశ్​..రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్​లోకి తీసుకొస్తే హరీశ్ రావుకు మంత్రి పదవి ఇస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ‘రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ అంటూ హరీశ్​ను ఉద్దేశిస్తూ అన్నారు. ‘‘పార్టీ కోసం హరీశ్ ఎంతో కష్టపడుతున్నడు. అది లాభం లేని కష్టం.. బీఆర్ఎస్​లో ఉంటే హరీశ్​కు ఫ్యూచర్ లేదు. కాంగ్రెస్​లోకి వస్తే మినిస్ట్రీ ఇస్తాం. ఇరిగేషన్ ఇవ్వం.. దేవాదాయ శాఖ ఇస్తం.. ఎందుకంటే గత పదేండ్లలో చేసిన పాపాలు అన్ని కడుక్కోవాలి కదా.. మా పార్టీని గతంలో విలీనం చేసుకున్నారు కదా.. మేమూ అదే చేస్తాం’’అని అన్నారు.

 సోమవారం అసెంబ్లీ ముగిసిన తర్వాత లాబీలో రాజ్​గోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘నాకు మంత్రి పదవి రాదని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడ్తున్నరు. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి డిస్ట్రర్బ్ చేస్తున్నరు. ఇలాంటి చీప్ పాలిటిక్స్ మానుకోవాలి. కడియం శ్రీహరి, హరీశ్​ రావులా నేను జీ హుజూర్.. అనే వ్యక్తిని కాదు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు త్యాగం చేసిన కుటుంబం మాది’’అని ఆయన అన్నారు.