
ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం మూడేళ్లలో కట్టామన్నారు మంత్రి కేటీఆర్. ఈ ఏడాది కోటి ఎకరాల సాగు జరుగుతోందన్నారు. రైతు బాగుపడితే దేశం బాగుపడుతోందన్నారు. ఊర్లు విడిచి వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు వస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. బీజేపీ వాళ్లు ఐటీఐఆర్ టీఆర్ఎస్ వల్ల రాలేదని చెబుతున్నారన్నారు. దీనిపై కేటీఆర్ కేంద్రానికి డీపీఆర్ ఇచ్చారని… సీఎం లేఖ రాశారన్నారు.
కేంద్ర బడ్టెట్ లో రాష్ట్రానికి కోతలు, ప్రజలకు వాతలే మిగిలియాన్నారు. ఎన్నికలు ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులకు మెట్రో విస్తరణకు అవకాశం ఇచ్చారన్నారు.. కర్ణాటకలోను మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపారని.. గుజరాత్ కు బుల్లెట్‌ట్రైన్ ఇచ్చారన్నారు. తెలంగాణకు మొండి చేయి చూపారన్నారు.. ప్రగతి సాధించే తెలంగాణ కన్నా వెనుకబడిన బీహార్ వంటిరాష్ట్రాలకు బడ్జెట్ లో ఎక్కువ నిధులు ఇచ్చారన్నారు.ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారని… తెలంగాణలోకూడా బీహెచ్ఈఎల్, బీడిఎల్ వంటి వాటిని ప్రయివేటుపరం చేస్తారన్నారు.