టీఆర్ఎస్ ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లే

టీఆర్ఎస్ ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లే

టీఆర్ఎస్ ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనన్నారు మంత్రి హరీష్ రావు.  రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైద్రాబాద్ గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నంలో  ప్రచారం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..బీజేపీ  రాష్ట్రానికి ఇచ్చిందేమిలేదన్నారు. అనవసర ఆరోపణలు చేస్తూ రెచ్చగొడుతున్న బీజేపీ నాయకులు చేతనైతే  విభజన హామీలు అమలయ్యేలా చూడాలన్నారు. కరోనా సమయంలో కూడా తెలంగాణ 14శాతం వృద్ది రేటుతో ముందుకు పోతుందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రతి ఇంటికి త్రాగునీరు, 24 గంటల కరెంట్ అందిస్తున్నామన్నారు. వంద శాతం ఇచ్చిన హామీలను అమలుచేసి తీరుతామన్నారు. ప్రతి 50 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఒక ఇంఛార్జిని నియమిస్తామన్నారు. ఎమ్మెల్సీగా వాణిదేవిని మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.