కాళేశ్వరంపై దుష్ప్రచారం పటాపంచలవుతున్నది : హరీశ్ రావు

కాళేశ్వరంపై దుష్ప్రచారం పటాపంచలవుతున్నది : హరీశ్ రావు
  •     నీటిని లిఫ్ట్​ చేయవచ్చని హైకోర్టుకు ఎన్డీఎస్ఏ చెప్పింది: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని.. పనికిరాదని.. నీళ్లు ఎత్తిపోయలేమంటూ కాంగ్రెస్​ చేసిన దుష్ప్రచారం పటాపంచలవుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్‌‌ చేసుకోవచ్చని స్వయంగా నేషనల్​ డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో స్పష్టం చేసిందని వెల్లడించారు. సీడబ్ల్యూపీఆర్ఎస్(సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్)​ పరిశీలనలో అన్నారం, సుందిళ్లలో ఏ బ్లాక్‌‌లోనూ నిర్మాణపరమైన సమస్య లేదని, కాంక్రీట్‌‌ నాణ్యత కూడా బాగున్నట్లు వెల్లడైందని  హరీశ్ రావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి, తెలంగాణకు వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేయడం రేవంత్‌‌ రెడ్డి ప్రభుత్వ నెగ్లిజెన్స్‌‌కు నిదర్శనమని మండిపడ్డారు. ప్రాజెక్టును నిందిస్తూ నీటిని లిఫ్ట్‌‌ చేయకుండా ఏపీకి వదిలిపెట్టడం ద్వారా తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేశారన్నారు. తాము నిలదీశాకే దేవాదుల, నంది పంపులు ఆన్‌‌ చేశారని, అప్పటికే వరద నీరంతా కిందికి వెళ్లిపోయిందని విమర్శించారు. 

ఏపీకి నీళ్లు వదిలి.. తెలంగాణ రైతులకు కన్నీళ్లు మిగిల్చారన్నారు. దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు సగటున 64.16 శాతం ఉండగా.. తెలంగాణలో మాత్రం కేవలం 35.6 శాతమే ఉన్నాయన్నారు. ఇవి కేవలం అంకెలు కాదని, తెలంగాణ రైతాంగానికి రాబోయే నీటి సంక్షోభానికి సంకేతాలని పేర్కొన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం మానేసి.. అన్నారం, సుందిళ్ల మోటార్లు ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోయాలని, రిజర్వాయర్లు నింపి రైతుల పొలాలకు నీళ్లు అందివ్వాలని ప్రభుత్వాన్ని హరీశ్ డిమాండ్​ చేశారు.

పేద ప్రజల కంటిమీద కునుకులేదు..

కుత్బుల్లాపూర్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ పాలనతో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. రేవంత్​సర్కారు అధికా రంలోకి రాగానే ఓవైపు హైడ్రా, మరోవైపు 22ఏ పెట్టి  ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు. కుత్బు ల్లాపూర్ నియోజకవర్గం షాపూర్​నగర్​లో 22ఏ  భూముల బాధితులతో ఆయన మంగళ వారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ..  30, 40 ఏండ్ల క్రితం ఉన్నకాలనీలు, ఇండ్లను 22ఏ లో చేర్చడమేమిటని ఆయన ప్రశ్నిం చారు. 

ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి  ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలు శిక్ష అనుభ వించాలా? అని నిలదీశారు. లక్షలాది మంది ప్రజల ఆస్తుల ను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి నిద్రలేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వా నికి దక్కుతుం దన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ అసెంబ్లీ లో పోరాడతామని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.