- సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే ఏడో గ్యారంటీ అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే తమ పాలసీ అని నిరూపిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సికింద్రాబాద్మున్సిపల్కార్పొరేషన్ సాధన కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య అని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటన్నారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవద్దని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
