ఆశ చూపించి మోసం చేసిన కాంగ్రెస్‌‌‌‌ : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

ఆశ చూపించి మోసం చేసిన కాంగ్రెస్‌‌‌‌ : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

    సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

సిద్దిపేట రూరల్, వెలుగు : ఎన్నికల సమయంలో ప్రజలకు ఆశ చూపిన కాంగ్రెస్‌‌‌‌.. ఇప్పుడు మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం శంకరాయకుంటలో సోమవారం బాల వికాస వాటర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్‌‌‌‌ కాళేశ్వరం నీళ్లు తెచ్చి, రైతు బందు, రైతు బీమాతో పాటు కేసీఆర్‌‌‌‌ కిట్‌‌‌‌ వంటి ఎన్నో స్కీమ్స్‌‌‌‌ అమలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస ప్రభుత్వం మాత్రం... రూ. 4 వేల పెన్షన్‌‌‌‌, రూ. 15 వేలు రైతుబంధు, మహిళలకు రూ. 2500 ఇస్తా అని ఆశ చూపి మోసం చేసిందన్నారు. రైతు రుణమాఫీ సగం చేసి చేతులు దులుపుకుందని, రైతు బీమా రద్దు చేసిందన్నారు. 

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీయేనన్నారు. అనంతరం ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ సాగుపై సిద్దిపేట క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో ఆయిల్‌‌‌‌ఫెడ్‌‌‌‌, హార్టికల్చర్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. యాప్‌‌‌‌తో లింక్‌‌‌‌ లేకుండా ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ రైతులకు యూరియా అందించాలని సూచించారు. అనంతరం అమర్‌‌‌‌నాథ్‌‌‌‌ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్‌‌‌‌నాథ్‌‌‌‌కు పంపుతున్న సరుకుల వాహనాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌‌‌‌ హుస్సేన్, అమర్‌‌‌‌నాథ్‌‌‌‌ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు నందిని శ్రీనివాస్‌‌‌‌తో కలిసి ప్రారంభించారు.