
- సీఎం రేవంత్ పై హరీశ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: నల్లమల బిడ్డనని గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను కలవడానికి వచ్చిన అమాయక చెంచుబిడ్డలను అరెస్ట్ చేయించి నియంతృత్వ నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని ఎమ్మెల్యే హరీశ్ అన్నారు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులతో చెంచు ఉద్యమ నాయకులను నిర్బంధించి నల్లమల డిక్లరేషన్ ప్రకటించడమే ప్రజాపాలనా అని సోమవారం ఓ ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. రేవంత్ అసమర్థ పాలనలో అమలు కాని హామీలను ప్రజలు పదేపదే గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.