సాంప్రదాయ రాజకీయాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారనే భావన ఉంది: హరీష్ రావు

సాంప్రదాయ రాజకీయాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారనే భావన ఉంది: హరీష్ రావు

కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చింది.. ఎన్నికలపుడు ఇష్టమొచ్చిన విధంగా ప్రజలను మభ్యపెట్టి.. ఇపుడు వాటి గురించి మనం అడిగితే కాకమ్మ కథలు చెబుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జనవరి 17వ తేదీ బుధవారం తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌ పార్టీ నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడారు. 

తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడినం.. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డాం.. మన పార్టీ స్థానం మారింది.. పాలన నుంచి ప్రతి పక్షానికి వచ్చాం.. అయినా అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాలకతీతంగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం ..- సాంప్రదాయ రాజకీయ పద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉన్నారని.. కొంత అది నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉందన్నారు. 

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం లభిస్తుందన్నారు. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని...ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు నష్టం జరుగుతుందని హరీష్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠంగా నేర్చుకుని ముందుకు సాగుదాం.. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు హరీష్ రావు.

కేసీఆర్ అట కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటారని ఈ బ్రహ్మ జ్ఞాని బండి సంజయ్ చెబుతున్నాడని.. లొట్ట పిట్టలా వార్తల్లో ఉండేందుకు తాపత్రయ పడతాడపి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర,  పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదేనని బండి సంజయ్ అంటున్నాడని మండిపడ్డారు. మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారని..పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా ఉంది బండి సంజయ్ తీరు ఉందన్నారు.  కాంగ్రెస్-బీజేపీల మైత్రిని బండి సంజయ్ బహిరంగంగా ఒప్పుకున్నాడని అన్నారు. కరీంనగర్ కు ఒక్క రూపాయి తెనోడు అడ్డమైన విషయాలు అడ్డం పొడువు మాట్లాడుతున్నాడని విమర్శించారు.