V6 News

నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి : హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు

నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి : హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు

సిద్దిపేట, వెలుగు: అకాల వర్షంతో సిద్దిపేట నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అధికారులను కోరారు. శుక్రవారం కలెక్టర్, వ్యవసాయ అధికారులతో ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన ఆయన వడగండ్ల వర్షంతో  పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులకు ఆదేశించారు.

సిద్దిపేట అర్బన్ మండలంలో అకాల వర్షంతో  ఎక్కువ నష్టం జరిగిందని తన దృష్టికి వచ్చిందని,  క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని సూచించారు. రైతు బంధు ఇవ్వక,  పంట నష్టం పరిహారం ఇవ్వక రైతులను ప్రభుత్వం ఆగం చేస్తోందన్నారు.  గతంలో ముగ్గురు మంత్రులు వచ్చి దెబ్బతిన్న పంటలను పరిశీలించినా నేటి వరకు ఒక్క రూపాయి పరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్య పడొద్దు మీకు అండగా తానుంటానని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన  ప్రతి గింజను మిల్లర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు కొనాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హరీశ్‌‌‌‌‌‌‌‌రావు కోరారు.