ప్రజా సేవే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే హరీశ్ రావు

ప్రజా సేవే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు ప్రజా సేవే లక్ష్యంగా పని చేయాలని, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండలం సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పూల బాలకృష్ణ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ గౌడ్, వెంకట్, ప్రధాన కార్యదర్శి గా చింతల శ్రీనివాస్, కోశాధికారిగా మౌనిక నరేందర్ రెడ్డి, కార్యదర్శులుగా జక్కుల శ్రీలత శ్రీనివాస్, నర్సింహా రెడ్డి, సలహాదారులు అమ్మల వెంకటి, ప్రచార కార్యదర్శిగా అందె శంకర్, కార్యవర్గ సభ్యులుగా బొల్లు లక్ష్మి మల్లేశం, పన్యాల అర్చన శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. 

ఈ సందర్భంగా హరీశ్​రావు కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఎల్లుపల్లి, మిట్టపల్లి గ్రామాలు అవార్డులు సాధించి ఆదర్శంగా నిలిచాయని, అదే విధంగా అన్ని గ్రామాలను ఆదర్శంగా నిలపాలన్నారు. 

అంతకుముందు క్రిస్మస్ సందర్బంగా పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్మస్ కిట్టు అందించడం లేదన్నారు. పెద్దలింగారెడ్డి పల్లి సర్పంచ్ బట్టు భాస్కర్ రెడ్డి తో పాటు నూతన పాలక వర్గాన్ని అభినందించారు. తడ్కపల్లి గ్రామ ఉప సర్పంచ్ నరేందర్ బీఆర్ఎస్  పార్టీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.