హరితహారం చెట్లు నరికేసిన్రు : మంత్రి హరీశ్ సీరియస్

హరితహారం చెట్లు నరికేసిన్రు : మంత్రి హరీశ్ సీరియస్

సిద్దిపేట, వెలుగు: హరితహారం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. సిద్దిపేటలోని హైదరాబాద్ కు వెళ్లే రోడ్డు పొడవునా నాటినవాటిలో 11 చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున నరికి వేశారు. ఈ ఘటనను అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఆ పని చేసిందెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా కొందరు వ్యక్తులు బస్సులపై నిలబడి చెట్లను నరికి వేసినట్టుగా గుర్తించారు.

వారి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని, ఒకట్రెండు రోజుల్లో గుర్తిస్తామని మున్సిపల్ అధికారి ఐలయ్య మంగళవారం మీడియాకు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ చెట్లను నరికివేయడం హేయమైన చర్యగా పేర్కొంటూ పట్టణంలో పచ్చదనాన్ని పెంచాలని తాను ప్రయత్నిస్తుంటే ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచిదికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

see also: ఫీజు వసూల్ చేసి.. ఇంటర్ బోర్డుకు కట్టని కాలేజీ