నీరజ్‌కు భారీ మనీ ప్రైజ్.. ఎక్స్‌లెన్స్ సెంటర్‌‌ పదవి కూడా ఆఫర్

నీరజ్‌కు భారీ మనీ ప్రైజ్.. ఎక్స్‌లెన్స్ సెంటర్‌‌ పదవి కూడా ఆఫర్

చండీగఢ్: టోక్యో: యువ అథ్లెట్ నీరజ్‌ చోప్రా సంచలనం సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ఇవాళ (శనివారం) జరిగిన జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్రలో నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్ మొత్తంలో భారత్‌కు వచ్చిన ఏకైన బంగారు పతకం ఇదే. అంతే కాదు మన దేశానికి ఒలింపిక్స్ చరిత్రలోనే జావెలిన్‌ త్రో పోటీల్లో మెడల్ రావడం కూడా ఇదే మొదటిసారి.ఒలింపిక్స్ అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్) చరిత్రలోనే భారత్ సాధించిన తొలి మెడల్‌ కూడా ఇదే. ఇన్ని రికార్డులను క్రియేట్ చేసిన 23 ఏండ్ల నీరజ్ చోప్రా సొంత రాష్ట్రమైన హర్యానా అతడికి భారీ నజరానా ప్రకటించింది.

నీరజ్‌కు రూ.6 కోట్ల నగదు బహుమతి అందజేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. అలాగే క్లాస్–1 కేటరిగీ జాబ్ ఇస్తామని చెప్పారు. 50 శాతం కన్సెషన్‌తో ప్లాట్ ఇస్తామన్నారు. అలాగే రాష్ట్రంలోని పంచకులలో అథ్లెట్స్ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌‌ బిల్డింగ్ నిర్మిస్తున్నామని, నీరజ్ ఓకే అంటే దానిని హెడ్‌ పదవిని అప్పగించేందుకు సిద్ధమని ఖట్టర్ ఆఫర్ ఇచ్చారు.

More News

సెల్యూట్ నీరజ్: నిజమైన సోల్జర్

ఒలింపిక్స్ చరిత్రలో చాలా ఫస్ట్‌లు