వరదల్లో మునిగిపోయిన హోం మినిస్టర్ ఇల్లు..

వరదల్లో మునిగిపోయిన హోం మినిస్టర్ ఇల్లు..

హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రాష్ట్రంలోని అత్యంత ప్రభావితమైన నగరాల్లో అంబాలా ఒకటి. ఇక్కడ వర్షపు నీరు అనేక ఇళ్లలోకి ప్రవేశించి జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అంబాలాలోని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ నివాసం జలమయమైంది. ఇంటి పరిసరాలన్నీ  నీటితో నిండి పోయాయి.

ALSOREAD :ఐటీ ఉద్యోగులకు మరో గండం ముంచుకొస్తోంది

రెసిడెన్షియల్ కాలనీలో ఒక వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యాడు. మరో ఘటనలో అంబాలా నగరంలో మూడు మృతదేహాలు నీటిలో తేలాయి. మృతుల్లో ఇద్దరు 70, 20 ఏళ్ల వయసున్న వారిగా గుర్తించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, హర్యానా, పొరుగున ఉన్న పంజాబ్‌లో వర్షాలకు సంబంధించిన పలు సంఘటనలలో దాదాపు 15 మంది మరణించారు. జిల్లాలో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ త్వరలోనే అంబాలాను సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు.

 

#WATCH | Haryana Home Minister Anil Vij's residence in Ambala flooded following incessant rainfall in the state. pic.twitter.com/N815lda0Ex

— ANI (@ANI) July 12, 2023