ఐటీ రంగంలో టీసీఎస్ టెన్షన్.. ఆఫర్స్ ఇచ్చినా జాయినింగ్స్ ఆలస్యం

ఐటీ రంగంలో టీసీఎస్ టెన్షన్.. ఆఫర్స్ ఇచ్చినా జాయినింగ్స్ ఆలస్యం

ఐటీ సంస్థలు కష్టాల కడలిలో వ్యాపారాన్ని ఈడుస్తున్నాయి. 2023 మొదలైన నాటినుంచి టెక్ సంస్థలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.  భారత్ లో దిగ్గజ టెక్ సంస్థ టీసీఎస్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఆన్ బోర్డింగ్ లెటర్స్   పంపలేదని   ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దీంతో ఐటీ ఉద్యోగులకు మరోగండం ముంచుకొస్తోందని ఐటీ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఓ పక్క  ఆర్థిక మాంద్యం... మరో పక్క ఆదాయం తగ్గడంతో ఐటీ సంస్థల యాజమాన్యం ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ వంటి సంస్థలు వేలాది మంది  ఉద్యోగులను తొలగించాయి. అయితే ఈ పరిణామాలు ఇండియాపై పెద్దగా ప్రభావం చూపించలేదు. 

ఇప్పుడు  దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ లేటరల్ హైరింగ్ పేరుతో నియమించుకున్న ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వందలాది మంది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. జాయినింగ్ లెటర్లు ఇచ్చి, సంస్థలోకి ఆహ్వానించింది.  ఇప్పుడు ఆ ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

టీసీఎస్ లేటరల్ హైరింగ్ పేరుతో నియమించుకున్న ఉద్యోగుల్ని 3 నెలల పాటు ప్రాజెక్టుల్లోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, ఆర్థికమాంద్యం వస్తుందనే భయాలు, ఆర్థిక అనిశ్చితి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. బెంగళూర్, పూణే, కొచ్చి, ఢిల్లీ, భువనేశ్వర్, ఇండోర్ కి చెందిన పలువురు ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది. వీరందరికి 18 ఏళ్ల నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్నవారే అని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

ALSOREAD : వరదల్లో మునిగిపోయిన హోం మినిస్టర్ ఇల్లు..

మరోవైపు2023  జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో నియమించుకున్న వారందరికీ ఇప్పటికే 2,3 సార్లు జాయినింగ్ డేట్స్ ఇచ్చి పోస్ట్‌పోన్ చేసింది. అక్టోబర్ వరకు జాయినింగ్ డేట్స్ ఇవ్వలేమని ఇటీవల అభ్యర్థులకు కంపెనీ మెయిల్స్ పెట్టినట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై టీసీఎస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఐటీ రంగంలో కోవిడ్-19, ఆర్థిక మాంద్యం పరిస్థితులు గందరగోళానికి కారణం అవుతున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా, జాయినింగ్ లెటర్లు ఇవ్వడానికి సతమతం అవుతున్నాయి. ఒక వేళ ఆఫర్ లెటర్లు ఇచ్చినా, కంపెనీ ప్రాజెక్టుల్లో పనిచేయించుకోవడం లేదు.  అస్థిరత నేపథ్యంలో ఆదాయాలు, ప్రాఫిట్స్ తగ్గుతుండటం ఈ ఐటీ కంపెనీలకు రానున్న రోజుల్లో సవాల్‌గా మారనుంది. పెద్దగా ప్రాజెక్టులు లేనప్పుడు కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించుకోవాలని కూడా చూస్తుంటాయి. ఇది ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు మరింత కష్టంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.