- ఒక్క రోడ్డయినా వేసిందా.. ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టిందా?: హరీశ్
- కేసులు, వేధింపులు తప్ప.. ఈ ప్రభుత్వానికి విజన్ లేదు
- జూబ్లీహిల్స్ బైపోల్ లేడీ వర్సెస్ రౌడీ అని కామెంట్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రోడ్లు, 43 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించామని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ఏం చేసిందని.. ఒక్క రోడ్డయినా వేసిందా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టిందా? అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే ఎంతకాలం పడుతుందో తెలియదు. ఎంతసేపూ వేధింపులు, కేసులు తప్ప.. ఈ ప్రభుత్వానికి ఓ విజన్లేదు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత గెలిచినంత మాత్రాన బీఆర్ఎస్ ప్రభుత్వమేమీ రాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకునేలా ఆ పార్టీ హైకమాండ్ నుంచి చివాట్లు వస్తాయి” అని విమర్శించారు. ఆదివారం ఎర్రగడ్డలోని మోతీనగర్ వాసవి బృందా వనం అపార్ట్‌మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ఉప ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ అన్నట్టుగా మారాయని వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ అభ్యర్థిది రౌడీ కుటుంబం కాకపోతే.. పోలీస్‌స్టేషన్‌లో నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులను ఎందుకు బైండోవర్ చేశారు. బైండోవర్ చేసిన వాళ్లను రౌడీ అనకపోతే ఏమంటారు?” అని ప్రశ్నించారు.
రాష్ట్రాభివృద్ధి కుంటుపడ్డది..
హైదరాబాద్‌ను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని హరీశ్ రావు అన్నారు. సినీ నటుడు రజనీకాంత్ హైద రాబాద్‌కు వచ్చి.. ఇది హైదరాబాదా? లేదంటే న్యూయార్క్ నగరమా? అని ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. ‘‘ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చే రోజుల నుంచి.. ఇక్కడ ఒక్క ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు కొనే స్థాయికి ఎదిగాం. ఇండస్ట్రీలు లైన్లు కట్టి హైదరాబాద్‌కు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పాలనలో ఇండస్ట్రీలన్నీ వెళ్లిపోతున్నాయి.
హైదరాబాద్‌కు రావాల్సిన గూగుల్.. ఏపీకి వెళ్లిపోయింది. కేసీఆర్ పాలనలో ఇండస్ట్రియలిస్టులు పెట్టు బడి పెట్టడానికి లైన్ కడితే.. కాంగ్రెస్ పాలనలో ఎరు వుల కోసం రైతులు లైన్‌లో నిలబడుతున్నారు” అని విమర్శించారు. పొరుగు రాష్ట్రం సీఎం పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారని, మన రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతుంటే మన సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తి గా కుప్పకూలిపోయింది. పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు భూమి అమ్ముదామంటే ధర లేక జనం నష్టపోతున్నా రు. రేవంత్అసమర్థ పాలనతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది’’ అని అన్నారు.
