వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( నవంబర్ 9 నుంచి 15 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం...
మేషరాశి : ఈ రాశి వారికి - ఈ వారంలో పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఇక వ్యాపారస్తుల విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్తగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. . వారం మధ్యలో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.
వృషభరాశి : ఈ రాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. మీరు తీసుకున్న ఆలోచనలు అమలు చేస్తారు. మీ నిర్ణయాలపై కుటుంబంలో అనుకూలత. సకాలంలో రావలసిన డబ్బు సమకూరుతుంది. భూములు, వాహనాలు కొంటారు. అనుకున్న రాబడి. ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యతిరేకులను మీవైపు ఆకట్టుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో లబ్ధి పొందుతారు. వ్యాపారులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మిథున రాశి: ఈ వారం ఈ రాశి వారికి అనుకూల ఫలితాలుంటాయి. అనుకున్న పనులు అనుకున్నవిధంగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు ఫలిస్తాయి.
కర్కాటకరాశి: ఈ వారం ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఈ వారం మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా పోతుంది. అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.
సింహరాశి : ఈ రాశి వారు ఈ వారం ఇతరులతో సమయస్ఫూర్తిగా మెలగాలి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తంగా ఉండండి. ప్రేమ.. వివాహ ప్రయత్నాలు వాయిదా వేయండి సాగిస్తారు. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండంది. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. పెద్దల సలహాను ఆచరించేటప్పుడు అవి మీకు ఎంత వరకు ఉపయోగపడాతాయో చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
కన్యారాశి :ఈ రాశి వారికి ఈవారంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవి ముందు మీకు అసంతృప్తి కలిగించినా.. తరువాత మంచే జరుగుతుంది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సమస్యలు వారం చివరిలో పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగినప్పటికి.. సంతృప్తికరంగానే ఉంటుంది. డబ్బు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.
తులా రాశి : ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులను సమర్థవంతంగా...సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం జరుగుతుంది. వృత్తి.. ఉద్యోగాలలో అధికారులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది. వారం చివరిలో వారాంతంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలని పండితులు సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికిఈ వారం కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల మవుతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు. ఉద్యోగం మార డానికి ఇది సమయం కాదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభి స్తుంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఈ వారంలో చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. అయినా మీ తెలివి తేటలతో అధిగమిస్తారు. కొన్ని అనవసర ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు వారం చివరిలో ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. ఇక వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు జాబ్ లభించే అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
మకర రాశి: ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు. గతంలో ఉన్న వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడి. పూర్వీకుల ఆస్తి కలసి వచ్చే అవకాశం ఉంది. బంధువుల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి..
కుంభరాశి: ఈ వారం ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతాయి. చేపట్టిన పనుల్లో మొదట్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విందు.. వినోద కార్యక్రమాలకు హాజరవుతారు.వృత్తి, వ్యాపారాలలో కొద్దిగా శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన ఫలితముంటుంది. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి అడుగు వేయాలి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా కలసి వస్తాయి. ఉద్యోగస్తుల విషయంలో కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. ఆఫీసులో జాగ్రత్తగా ఉండంది.. మీతో స్నేహంగా ఉంటూనే మీకు అపకీర్తి తీసుకొస్తారు.
మీనరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న కొన్ని ముఖ్యమైన పనుల్ని కొద్ది వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. రావలసిన సొమ్మును, మొండి బాకీలను వసూలు చేసుకుంటారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
