కోటీ రూపాయలకుపైగా విలువైన నల్లమందు స్వాధీనం

 కోటీ రూపాయలకుపైగా విలువైన నల్లమందు స్వాధీనం

హర్యానాలో భారీ స్థాయిలో నల్లముందు పట్టుబడింది. హిస్సార్ జిల్లాలో హర్యానా పోలీసులు 18 కిలోల నల్లమందు(ఓపియం)ను స్వాధీనం చేసుకున్నారు.  ట్రక్కులో ఓపియంను తరలిస్తున్న డ్రైవర్.. పోలీసులను చూసి పారిపోయాడు. 

వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన జ్ఞాన్ చంద్‌ ట్రక్కు డ్రైవర్. ఇతను తన ట్రక్కులో నల్లమందు తరలిస్తూ..హర్యానాలోని హిస్సార్ జిల్లాకు చేరుకున్నాడు. అయితే ఓ ఫ్యాక్టరీ ముందు తన ట్రక్కును పార్క్ చేశాడు. ఇంతలో పోలీసులు అక్కడికి రావడంతో వారిని చూసి  జ్ఞాన్ చంద్‌ పారిపోయాడు. చంద్ పారిపోవడాన్ని గమనించిన పోలీసులు.. ట్రక్కును తనిఖీ చేయగా..అందులో నల్లమందు ఉన్నట్లు గుర్తించారు. క్యాబిన్ లో దాచిన 20 నల్లమందు ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నాడు. దీనిపై  హిస్సార్ పోలీస్ స్టేషన్‌లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు. 

ఓపియం అంటే ఏమిటి

 ఓపియం అంటే నల్లమందు. గసగసాల మొక్కకు పూసే పువ్వు.. పక్వానికి వచ్చే దశలో అందులోంచి ఒక రకమైన ద్రవం వస్తుంది. ఆ ద్రవం నుంచి తయరు చేసే పదార్థాన్నే ఓపియం అంటారు. ఈ ఓపియంను రిఫైన్ చేస్తే హెరాయిన్‌గా మారుతుంది. ఉండలుగా ఉండే ఓపియంను ఒక గ్లాస్ నీటిలో వేసుకొని తాగితే మత్తు వస్తుంది. నాటు వైద్యంలో పలు రోగాలకు ఓపియంను  ఔషధంగా ఉపయోగిస్తారు. నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టెన్స్(NDPS) యాక్ట్ 1985 ప్రకారం ఓపియంను వాడినా.. కలిగి ఉన్నా.. రవాణాచేసినా.. కొనుగోలు చేసినా..విక్రయించినా నేరంగా పరిగణిస్తారు.