Cricket World Cup 2023: ఈ అందగత్తె హీరోయిన్ కాదు.. పాకిస్తాన్ క్రికెటర్ భార్య

Cricket World Cup 2023: ఈ అందగత్తె హీరోయిన్ కాదు.. పాకిస్తాన్ క్రికెటర్ భార్య

ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భార్య సమియా ఖాన్ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఇండియాలోని హర్యానాకు చెందిన ఈమె హసన్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇక్కడ ఏడేళ్ల తర్వాత అడుగుపెట్టడంతో ఆమె ఢిల్లీలోని స్ట్రీట్ ఫుడ్ తినాలని చెప్పడం.. హసన్ అలీ ఆ కోరిక నెరవేర్చలేనందుకు బాధపడం తెలిసిందే. అయితే తాజాగా పాక్ హైదరాబాద్ లో మ్యాచులు పూర్తి చేసుకువడంతో ఇక్కడ కొన్ని ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో దిగిన ఈ ఫోటోలో సమియా ఖాన్ ని చూసినవారెవరైనా హీరోయిన్ అనుకోవడం ఖాయం. మోడ్రన్ డ్రెస్ లో ఎంతో గ్లామర్ గా కనిపించిన ఈమెను చూసి నెటిజన్స్ ఎవరు ఈ హీరోయిన్ అని కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ భామలకు పోటీ ఇచ్చే విధంగా  సమియా ఖాన్ అందం ఉంది. ఈమె తాజా ఫోటోలు  చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సించే అని కొంతమంది అంటున్నారు.

ALSO READ: Cricket World Cup 2023: రెడీ అంటున్న పందెం రాయుళ్లు: ఇండియా- పాక్ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్
 

ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ జట్టు హైదరాబాద్ లో తమ రెండు వారాల ప్రస్థానాన్ని ముగించింది. వరల్డ్ కప్ లో ఇక్కడ ఆడిన రెండు మ్యాచులను గెలవడంతో పాటు ఇక్కడ తెలుగు వారి అభిమానానికి ముగ్ధులయ్యారు. జట్టులోని అందరూ ప్లేయర్లు కూడా హైదరాబాద్ వదిలి వెల్తూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం అహ్మదాబాద్ చేరుకున్న పాక్ జట్టు.. అక్టోబర్ 14 న భారత్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచుపైనా భారీ అంచానాలు ఉన్నాయి.