'దసరా'లో నాని మాస్ లుక్

'దసరా'లో నాని మాస్ లుక్

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా” రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు తాజాగా మూవీ మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓడెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తుండగా మేకర్స్ అయితే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ ఇటీవలే ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక దసరా సినిమా రిలీజ్ డేట్ తో పాటు, ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ రిలీజ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నాని మాస్‌ లుక్ లో కనిపిస్తున్నారు. చెదిరిపోయిన రింగుల జుట్టు, మాసిపోయిన బట్టలు, దుమ్ముతో నిండిన శరీరంతో ఉన్న నాని ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకునేదిగా ఉంది.  దీంతో పాటు చేతిలో ఉన్న మద్యం సీసా అతని మొరటుతనాన్ని  తెలియజేస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకప్పటి పాపులర్ స్టార్ హీరోయిన్ సిల్క్ స్మిత తన గోళ్లు కొరికే చిత్రం ఉండడాన్ని గమనించవచ్చు.

 

MARCH 30th, 2023 WORLDWIDE ? #EtlaitheGatlayeSuskundhaam This one will be remembered for a long time? Telugu - Tamil - Malayalam - Kannada - Hindi #DASARA

Posted by Actor Nani on Thursday, August 25, 2022