గోల్డ్ బిజినెస్ పేరుతో మోసం..లక్షల్లో డబ్బులు వసూలు.. సీఐ భార్య అరెస్ట్

గోల్డ్ బిజినెస్ పేరుతో మోసం..లక్షల్లో డబ్బులు వసూలు.. సీఐ భార్య అరెస్ట్

గోల్డ్, గ్రానైట్ బిజినెస్ పేరుతో మోసం..అధిక వడ్డీ ఇస్తామని ఒక్కొక్కరినుంచి లక్షల్లో వసూలు చేసింది. లక్షలు వసూలు చేశావు.. మా డబ్బు ఎప్పుడు తిరిగిస్తావు అని అడిగితే ..సీఐ భార్యను నన్నే డబ్బులు అడుగుతావా   బెదిరింపులకు పాల్పడింది. చివరికి కటకటాల పాలయ్యింది. 

సూర్యాపేట జిల్లా మునగాల సీఐ భార్య కవితారెడ్డి.. బంగారం, గ్రానైట్ బిజినెస్ ల పేరుతో అమాయకులనుంచి లక్షలు వసూలు చేసి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడటంతో  ఆమెపై కేసులు నమోదు చేశారు పోలీసులు. హయత్ నగర్ లో నమోదై న కేసులో కవితారెడ్డిని నాగోల్ లో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు హయత్ నగర్ పోలీసులు. 

నాగోల్ లో నివాసం ఉంటు బోటిక్ బిజినెస్ చేస్తూ కస్టమర్లను సైతం మోసం చేసింది కవితారెడ్డి. ఆమె మోసం చేసిన వాళ్లలో  ఆమె డ్రైవరే మొదటి బాధితుడు. ఆమె మాటలు నమ్మిన రూ.30 లక్షలు  ఇచ్చాడు. డబ్బుల గురించి అడిగితే బెదిరింపులకు పాల్పడింది.. సీఐ భార్యను నన్నే డబ్బులు అడుగుతావా అంటూ బెదిరించింది. దీంతో హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు మధు, అతని స్నేహితుడు. రంగంలోకి దిగిన పోలీసులు  కవితారెడ్డిని నాగోల్ లో అరెస్ట్ చేశారు. కవితారెడ్డి  బాధితులు  చాలామంది  ఉన్నట్లు తెలుస్తోంది. 

ఉంటే.. గత కొంతకాలంగా నాగోల్ లో ఉంటూ స్నేహితురాలితో బొటిక్ బిజినెస్ చేస్తున్న కవితా రెడ్డి.. కస్టమర్లను సైతం మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు.  ఇదిలా ఉంటే కవితారెడ్డి ఆమె భర్తతో దూరంగా ఉంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు.