హైదరాబాద్, వెలుగు: బీసీసీఐ జూనియర్ మెన్స్ అండర్–-19 వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ చాంపియన్‌గా నిలిచింది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 28.2 ఓవర్లలో 111 రన్స్‌కే ఆలౌట్ అయింది.
పంజాబ్ బ్యాటర్లలో విహాన్ (28), ఆర్యన్ యాదవ్ (29) మాత్రమే కాస్త రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో యశ్‌వీర్ (3/22) మూడు వికెట్లతో సత్తా చాటగా, ఎంఏ మాలిక్ (2/21), నిపుణ్ రెడ్డి (2/24), ఉజైర్ అహ్మద్ (2/25) తలో రెండు వికెట్లు పడగొట్టి పంజాబ్‌ను కట్టడి చేశారు. అనంతరం హైదరాబాద్ 29.3 ఓవర్లలో 112/5 స్కోరు చేసి గెలిచింది. అలంక్రిత్ ఆర్ (58 నాటౌట్), అవేజ్ అహ్మద్ (35 నాటౌట్) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్ ఇషాన్ సూద్ (5/18) ఐదు వికెట్లు పడగొట్టాడు. వినూ మన్కడ్ ట్రోఫీ గెలిచిన హైదరాబాద్‌ను హెచ్‌సీఏ సూపర్‌వైజర్ కమిటీ హెడ్, రిటైర్డ్ జస్టిస్ పి. నవీన్ రావు అభినందించారు. టీమ్‌లోని ప్రతీ ప్లేయర్‌కు రూ. 2 లక్షలు, సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్‌కు తలో 1.5 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ ప్రకటించారు.
