ఎమ్మెల్యే వినోద్, వివేక్ తనలాంటి చాలామందికి ఆదర్శమన్నారు హెచ్ సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. హెచ్ సీఏ మాజీ అధ్యక్షులు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిలను హెచ్ సీఏ సభ్యులు సన్మానించారు.
తుక్కుగూడ దగ్గరలోని హర్షగూడలో జరిగిన ఈ కార్యక్రమంలో 100 మంది హెచ్సీఏ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హెచ్ సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు.. వినోద్,వివేక్ లు క్రికెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. గ్రామీణప్రాంతల్లో క్రికెట్ అభివృద్ధికి వాళ్ల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.
