న్యూఢిల్లీ: ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ దేశీయ సావరిన్ ఏఐ మోడల్ డెవలపర్ సంస్థ సర్వం ఏఐ లో 10.46 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ వ్యూహాత్మక డీల్ విలువ రూ. 1,427 కోట్లు. దీంతో సర్వం ఏఐ మార్కెట్ విలువ రూ. 12,500 కోట్లకు చేరింది.
ఈ పెట్టుబడికి ఎలాంటి నియంత్రణ అనుమతులూ అవసరం లేదని హెచ్‌సీఎల్ వెల్లడించింది. మనదేశం కోసం పూర్తి స్థాయి సావరిన్ ఏఐ ప్లాట్‌ఫారమ్‌ను సర్వం ఏఐ అభివృద్ధి చేస్తోంది.
పరిశోధనలు, మోడల్స్, మౌలిక సదుపాయాలు, అప్లికేషన్ల విభాగాలలో ఈ సంస్థ పనిచేస్తోంది. 2025-–26 ఆర్థిక సంవత్సరంలో సర్వంకు రూ. 45.1 కోట్ల ఆదాయం వచ్చింది.
