హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ కొత్త చైర్మన్ రాజీవ్ కుమార్‌‌‌‌

హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ కొత్త చైర్మన్ రాజీవ్ కుమార్‌‌‌‌

    కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శిని నియమించిన బ్యాంక్ బోర్డ్  

న్యూఢిల్లీ:  హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్  తమ కొత్త చైర్మన్‌‌గా కేంద్ర మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌‌‌‌ను నియమించింది. దీనికి సంబంధించి సోమవారం (జూన్ 29) జరిగిన బోర్డు  మీటింగ్‌‌లో నిర్ణయం తీసుకున్నారు.

 నైతిక కారణాల రీత్యా ఈ ఏడాది మార్చిలో అకస్మాత్తుగా చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన అతాను చక్రవర్తి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.   జూన్ 30, 2026 నుంచి నాలుగేళ్ల పాటు రాజీవ్ కుమార్‌‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌‌గా బోర్డు ఆమోదించింది. అలానే, ఆయనను మూడేళ్ల పాటు పార్ట్-టైమ్ చైర్మన్‌‌గా నియమించింది. ఈ నియామకాన్ని  ఆర్‌‌‌‌బీఐ ఆమోదించాల్సి ఉంది.  బ్యాంకుల  మొండి బకాయిల (ఎన్‌‌పీఏల) సమస్యను పరిష్కరించడానికి రికగ్నిషన్, రిజల్యూషన్, రీక్యాపిటలైజేషన్, రిఫార్మ్స్ (4ఆర్‌‌‌‌) వ్యూహాన్ని అమలు చేసి, బ్యాంకులు మళ్లీ లాభాల్లోకి