2 నిమిషాల్లోనే లోన్​!​

2 నిమిషాల్లోనే లోన్​!​


న్యూఢిల్లీ: ఎంపిక చేసిన కొంతమంది కస్టమర్లకు వాట్సాప్​ ద్వారా రెండు నిమిషాల్లోనే స్పాట్​హోమ్​లోన్​ ఖరారు చేస్తామని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ప్రకటించింది. ఇందుకోసం కస్టమర్లు  9867000000 అనే నంబరుకు వాట్సాప్​ తో మెసేజ్​ పంపాలి. పాన్​కార్డు, అడ్రస్​ వంటి కొన్ని వివరాలు ఇవ్వాలి.  అన్ని అర్హతలు ఉంటే, అప్పటికప్పుడే సూత్రప్రాయంగా అప్రూవల్​వస్తుంది. రోజులో 24 గంటలూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని హెచ్​డీఎఫ్​సీ ప్రకటించింది. లోన్​ కోసం పడిగాపులు కాయాల్సిన అవసరమే లేదని తెలిపింది. తమ హోమ్​లోన్​ అప్లికేషన్లలో 91 శాతం దరఖాస్తులు డిజిటల్​ చానెల్స్​ ద్వారా వస్తున్నాయని పేర్కొంది.