కొత్త హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌తో పోటీకి రెడీగా ఉండండి : నిర్మలా సీతారామన్

కొత్త హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌తో పోటీకి రెడీగా ఉండండి : నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: బ్యాడ్‌‌‌‌ లోన్లను తగ్గించుకోవడంపై ఫోకస్‌‌‌‌ పెట్టాలని, కావాలని అప్పులు ఎగ్గొట్టిన వారిని గుర్తించి వేగంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ బ్యాంకుల చీఫ్‌‌‌‌లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. బ్యాంకుల  గ్రోత్‌‌‌‌ పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ విలీనం వలన కాంపిటీషన్ పెరుగుతుందని, దీనికి రెడీగా ఉండాలని కూడా అన్నారు.

కాగా, గత ఆరు ఆర్థిక సంవత్సరాలలో  బ్యాంకులు రూ.11.17 లక్షల కోట్ల మొండిబాకీలను రైటాఫ్‌‌‌‌ చేశాయి. తమ బుక్స్ నుంచి వీటిని తొలగించాయి. కానీ, ఈ లోన్లను రికవరీ చేస్తున్నాయి. రిస్క్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, సైబర్ సెక్యూరిటీ రిస్క్‌‌‌‌లను తగ్గించేందుకు పని చేయాలని సీతారామన్ అన్నారు. బ్యాంకులు కఠినమైన ఇంటర్నల్ ఆడిట్‌‌‌‌ ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌ ఫాలో కావాలని తెలిపారు.