సైబరాబాద్ : రోడ్డు పక్కన నిలుచున్న ఓ మహిళను DCM ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన హైదర్ గూడ చౌరస్తాలో శుక్రవారం మధ్నాహ్నం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే DCMని అక్కడే వదిలేసి డ్రైవర్ పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు..ఘటన స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం ఉస్మానియా హస్పిటల్ కి తరలించారు.
మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. DCM వ్యాన్ ను సీజ్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. DCM నంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.
