V6 News

ఆస్పత్రిలోనే గంగూలీ.. డిశ్చార్జ్ వాయిదా

ఆస్పత్రిలోనే గంగూలీ.. డిశ్చార్జ్ వాయిదా
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ గురువారం డిశ్చార్జ్ కానున్నారు. గంగూలీ ఇవాళ డిశ్చార్జ్ కావాల్సి ఉండగా..గురువారం(7న) డిశ్చార్జ్ చేస్తున్నట్లు  కోల్ కతాలోని వుడ్ లాండ్ ఆస్పత్రి ప్రకటించింది. గంగూలీ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని..కానీ  ఇంకో రోజు ఆస్పత్రిలోనే ఉంటానని గంగూలి చెప్పడంతో గురువారం డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. మైల్డ్‌ హార్ట్‌ ఎటాక్‌ తో ఈనెల 2న హాస్పిటల్‌ లో జాయిన్‌ అయిన దాదాకు డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేశారు. దాదా గుండెలో మూడు బ్లాక్స్‌ గుర్తించి న డాక్టర్లు ఒక దానికి స్టెంట్‌ వేశారు. ‘గంగూలీకి చేసిన రొటీన్‌ బ్లడ్‌ టెస్టుల రిపోర్టులన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. ఎండో కార్డియోగ్రఫీ చేయగా ఆ రిపోర్ట్‌ కూడా బాగానే ఉంది. సౌరవ్‌ ను డిశ్చార్జ్‌ చేసినప్పటికీ 2–3 వారాల పాటు ఇంటి వద్ద అతనికి ట్రీట్‌ మెంట్‌ కొనసాగు తుందని హాస్పిటల్‌ సీఈవో డాక్టర్‌‌ రూపాలి బసు తెలిపారు . #SouravGanguly who is admitted here is doing well. He is clinically fit. He wanted to stay back in the hospital for one more today so he will go home tomorrow: Woodlands Hospital, Kolkata pic.twitter.com/PxNyZHxbEu — ANI (@ANI) January 6, 2021