అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ: ట్రంప్

అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ: ట్రంప్

కరోనా వైరస్  అమెరికాను వణికిస్తోంది. వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడంతో ట్రంప్ ప్రభుత్వం అలర్టైంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. నివారణ చర్యల కోసం 5 వేల కోట్ల డాలర్లు విడుదల చేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గతంలో ట్రంప్ కరోనా బాధితులను కలుసుకున్న క్రమంలో.. తాను ఇప్పటి వరకు కరోనా పరీక్షలు చేయించుకోలేదని…ఇప్పుడు చేయించుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో, ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోను ట్రంప్ కలిశారు. తాజాగా ఫాబియోకు వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, బోల్సోనారోకు మాత్రం కరోనా సోకలేదని తేలింది. ఈ విషయమై ట్రంప్ మాట్లాడుతూ.. తాను దాదాపు రెండు గంటలపాటు బోల్సోనారోతో కలిసి ఉన్నట్టు చెప్పారు. ఇద్దరం కలిసి భోజనం చేశామని, పక్కపక్కనే ఉన్నామని తెలిపారు. అయితే.. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని తెలిపారు ట్రంప్.