రాజీవ్ స్వగృహ, హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు ప్లాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేలానికి  జూన్ 20లోగా నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాజీవ్ స్వగృహ, హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు ప్లాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేలానికి  జూన్ 20లోగా నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • గాజులరామారం, పోచారం, ఖమ్మంలో టవర్లు
  • వేలంతో రూ.1,500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారుల అంచనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రాజీవ్ స్వగృహ టవర్లు, హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలానికి ఈ నెల 20లోగా వేలానికి సంబంధించి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజీవ్ స్వగృహలో అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ టవర్లు, పూర్తయిన, అసంపూర్తిగా పూర్తయిన ఫ్లాట్స్ ఉన్నాయి. హౌసింగ్ బోర్డుకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డితో పాటు జిల్లాల్లో ప్లాట్స్ ఉన్నాయి.

బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరల ప్రకారం వీటికి వేలం వేయాలని నిర్ణయించారు. దీంతో వేలం పాట ద్వారా రూ.1,500 కోట్ల రెవెన్యూ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన ఫ్లాట్లతో పాటు ఓపెన్ ప్లాట్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలోని నాలుగు ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను హౌసింగ్ అధికారులు కోరుతున్నారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయంతో ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లోనూ, ఇతర జిల్లాల్లోనూ సాధారణ ప్రజలకు హౌసింగ్ టౌన్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 

రాజీవ్ స్వగృహలో వేలం వివరాలు..

 రాజీవ్ స్వగృహకు సంబంధించి గాజుల రామారం, పోచారం, ఖమ్మంలోని పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లను మొత్తంగా విక్రయించనున్నారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 514, కుర్మల్ గూడలో 20, చందానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 3 ఓపెన్ ఫ్లాట్లు, బండ్లగూడలో 159 పూర్తియిన ఫ్లాట్లు, మేడ్చల్ -మల్కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి గాజులరామారంలో 5 టవర్లలోని పూర్తి కాని టవర్లు, పోచారంలోని పూర్తయిన 601 ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న 6 టవర్లలోని వివిధ రకాల ఫ్లాట్లు, బహదూర్ పల్లిలోని 69 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి.

మహబూబ్ నగర్ జిల్లాలోని పోతులమడుగులో 111, అమిస్తాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 45 ఓపెన్ ప్లాట్లను విక్రయించడానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న 8 టవర్లతో పాటు 3.38 ఎకరాల ఖాళీ స్థలాన్ని వేలంలో విక్రయించనున్నారు. మరోవైపు, కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ)- 4వ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖాళీగా ఉన్న 7 ఎకరాల 33 గుంటల విస్తీర్ణంలో ఖాళీ భూములను, అదే కాలనీలో ఉన్న రెండు ఓపెన్ ప్లాట్లను విక్రయించనున్నారు.

అలాగే, నాంపల్లిలోని 1,148 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఖాళీ స్థలాన్ని, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 2,605 చదరపు గజాలను వేలంలో విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కమ్యూనిటీ హాల్ (సెల్లార్, స్టిల్ట్, జీ+1) 22,285 చదరపు అడుగుల విస్తీర్ణం, 37,070 చదరపు అడుగుల పార్కింగ్ స్థలంతో పూర్తయ్యే స్థితిలో ఉన్నది.

కాగా, కూకుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలోని కొన్ని ప్లాట్స్ వేలానికి హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే దారిలో హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్, కేపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ 7, 9 ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మొత్తం 19 ప్లాట్స్ వేలం వేయనున్నారు. ఇక్కడ గజం ధర రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు అధికారులు ఖరారు చేశారు. ఈ నెల 11న కేపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ కమ్యూనిటీ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేలం వేయనున్నట్లు అధికారులు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు