ఉమ్మడి పాలమూరుకు నాలుగు ఏటీసీలు

ఉమ్మడి పాలమూరుకు నాలుగు ఏటీసీలు

మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాకు నాలుగు అడ్వాన్స్​ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ) మంజూరు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సోమవారం సాయంత్రం అడ్మినిస్ట్రేటివ్​ శాంక్షన్​ లభించింది. దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలంలోని పల్లమర్రి, జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్​ మండలం ఈద్గాన్​పల్లి, నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి, నాగర్​కర్నూల్​ నియోజకవర్గంలోని తూడుకుర్తి గ్రామంలో వీటిని ఏర్పాటు చేయనుంది. 

ఐటీఐలకు అనుబంధంగా ఈ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. టాటా టెక్నాలజీస్​ లిమిటెడ్(టీటీఎల్​)​ సహకారంతో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటికి సంబంధించిన నిధుల్లో కొంత  భాగం టాటా, మిగిలిన భాగం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.