అనుకున్న టైంకి మెసేజ్ రీచ్ అయ్యేలా..వాట్సాప్ లో ఫ్యూచర్

అనుకున్న టైంకి మెసేజ్ రీచ్ అయ్యేలా..వాట్సాప్ లో ఫ్యూచర్

కొన్నిసార్లు పనిలో పడిపోయి ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోతుంటాం. బర్త్​డే, యానివర్సరీ డేట్​లు, కొత్తగా ఏదైనా చేయాలనుకునే టాస్క్​లు వంటివి ఎంత గుర్తుపెట్టుకోవాలనుకున్నా అప్పుడప్పుడు మిస్​ అవుతుంటాం. ఈ సమస్యకు సొల్యూషన్ కావాలంటే వాట్సాప్​లోని ఈ ఫీచర్​ వాడాలి. అదే వాట్సాప్ షెడ్యూలింగ్. వర్క్​కి సంబంధించిన మెసేజ్​లు ఒక టైంకి పంపాలంటే అనుకున్న సమయానికి అలారం పెట్టుకోవాల్సిన పనిలేదు. 

దానికి బదులు టైం షెడ్యూల్​ ఆప్షన్​ ద్వారా మెసేజ్​ పంపొచ్చు. అయితే వాట్సాప్​ మెసేజ్​లు షెడ్యూల్​ చేయడానికి మరో యాప్ అవసరం అవుతుంది. అదే SKEDit. ఈ యాప్​ ఉపయోగించి వాట్సాప్​లోనేకాదు, ఇన్​స్టాగ్రామ్​, టెలిగ్రామ్​లలో కూడా మెసేజ్​లను షెడ్యూల్​ చేయొచ్చు. అదెలాగంటే.. యాప్​ని డౌన్​లోడ్ చేసి, లాగిన్ అవ్వాలి. మెయిన్​ స్క్రీన్​పై కనిపించే వాట్సాప్ ఐకాన్​ మీద క్లిక్ చేయాలి. కుడివైపు ఉన్న ప్లస్​ సింబల్​ని ట్యాప్​ చేశాక వాట్సాప్​ను సెలక్ట్ చేయాలి. 

ఆపై ప్రాసెస్​ పూర్తి చేసి, మళ్లీ ప్లస్ సింబల్​ ట్యాప్ చేస్తే కాంటాక్ట్ నెంబర్​ ఎంచుకోవచ్చు. ఆ తర్వాత మెసేజ్​ బాక్స్​లో మెసేజ్ టైప్ చేసి డేట్, టైం సెలక్ట్ చేయాలి. చివరిగా షెడ్యూల్​ ఆప్షన్ క్లిక్ చేస్తే సరి. 

ఐదు హ్యాష్​ ట్యాగ్​లు మాత్రమే!

ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసే రీల్​ లేదా ఫొటోలకు దాదాపు 30 వరకు హ్యాష్​ట్యాగ్​లు పెట్టుకునే వీలు ఉండేది. కానీ, ఇక నుంచి మ్యాగ్జిమమ్​ ఐదు హ్యాష్​ ట్యాగ్​లను మాత్రమే ఉపయోగించాలి అని ప్రకటించింది కంపెనీ. హ్యాష్​ట్యాగ్​ల సంఖ్య తగ్గినప్పటికీ కచ్చితమైన, రిలేటబుల్​ హ్యాష్​ట్యాగ్​లను వాడడం వల్ల పోస్ట్​ పని తీరుతోపాటు యూజర్లకు మెరుగైన ఎక్స్​పీరియెన్స్ ఇస్తుందని గుర్తించినట్టు ఇన్​స్టాగ్రామ్​ పేర్కొంది. కాబట్టి క్రియేటర్లు ఒక పోస్ట్ చేసేటప్పుడు హ్యాష్​ ట్యాగ్​ను తెలివిగా ఎంచుకోవాలని ఎంకరేజ్ చేస్తోంది. రీల్స్, ఎక్స్​ప్లోర్ వంటి హ్యాష్​ ట్యాగ్​లు నిజానికి ఎక్స్​ప్లోర్​ ఫీడ్​ను అందుకోలేవు. పైగా అవసరమైన వాళ్లతోపాటు కంటెంట్ అందరికీ చేరుతుంది. 

ఏఐ బేస్డ్​ వాయిస్ మెయిల్

ట్రూకాలర్​ మనదేశంలోని ఆండ్రాయిడ్​ యూజర్ల కోసం ఫ్రీ  ఏఐ బేస్డ్​ వాయిస్ మెయిల్​ ఫీచర్​ను లాంచ్ చేసింది. స్పామ్​ కాల్స్​ నుంచి రక్షించడమే దీని లక్ష్యం. ఈ ఫీచర్​ ప్రైవసీ, యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్​పీరియెన్స్​ను అందిస్తుంది. ఈ వాయిస్​ మెయిల్​ మెసేజ్​లు నేరుగా యూజర్ల ఫోన్​లలో సేవ్​ అవుతాయి. తద్వారా నెంబర్​కు కాల్ చేయడం లేదా పిన్​ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ కొత్త వాయిస్​ మెయిల్​ ఫీచర్​ను యూజర్లు స్పామ్ లేదా అన్​నోన్ కాల్స్​ను ఎదుర్కోవడంలో సాయపడేందుకు డిజైన్​ చేశారు. 

యూజర్లు ఇప్పుడు తెలియని కాల్స్​కు ఆన్సర్ ఇవ్వడానికి బదులు వాయిస్ మెయిల్​కు ఫార్వర్డ్ చేయొచ్చు. ఈ వాయిస్​ మెయిల్​ను సెటప్ చేయడానికి కేవలం కొన్ని సెకన్లు మాత్రమే పడుతుంది. ఈ ఫీచర్ ఫ్రీగా అన్​లిమిటెడ్ వాయిస్​ మెయిల్​ స్టోరేజీని అందిస్తుంది. దీంతోపాటు వాయిస్​ మెయిల్​ మెసేజ్​లు నేరుగా డివైజ్​లో రికార్డ్ కావడంతోపాటు స్టోర్ అవుతాయి. అలాగే ఆటోమెటిక్ స్పామ్ ప్రొటెక్షన్​, స్మార్ట్​ కాల్ కేటగిరైజేషన్, మెసేజ్​లను వేగంగా లేదా నెమ్మదిగా ప్లే చేయడానికి వాడే ప్లేబ్యాక్​ స్పీడ్ కంట్రోల్‌, వాయిస్​ మెయిల్ మెసేజ్​లను సెకన్లలో టెక్స్ట్​గా మార్చే ఏఐ బేస్డ్ ట్రాన్స్​స్క్రిప్షన్ వంటివి ఉన్నాయి. 

మరో ముఖ్యమైన స్పెషాలిటీ ఏంటంటే.. తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, నేపాలీ, పంజాబీ, సంస్కృతం, ఉర్దూతో సహా 12 భారతీయ భాషల్లో వాయిస్​ మెయిల్​ ట్రాన్స్​స్క్రిప్షన్​కు మద్దతు ఇస్తుంది. ఈ ఫీచర్ వినడానికి ఇష్టపడనప్పుడు యూజర్లు మెసేజ్​లను సైలెంట్​గా చదవడానికి ఉపయోగపడుతుంది.