మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: ఆశా కార్యకర్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే చలో హైదరబాద్ చేపడతామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు. ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ను ముట్టడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ లో చేసే లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న లెప్రసీ సర్వే, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు చెల్లించాలని, కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వరద గాలన్న, చంద్రకాంత్, హనుమంతు, సావిత్రి, హైమావతి, నిర్మల, నర్సమ్మ, అమృత, శశికళ పాల్గొన్నారు.
