హాస్టల్ లో సౌలతులు కల్పించాలి : బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బి.కృష్ణ యాదవ్

హాస్టల్ లో సౌలతులు కల్పించాలి : బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బి.కృష్ణ యాదవ్

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: బీసీ హాస్టళ్లలో స్టూడెంట్లకు సౌలతులు కల్పించాలని, సొంత భవనాలను నిర్మించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బి.కృష్ణ యాదవ్  డిమాండ్  చేశారు. శనివారం నగరంలోని బీకే రెడ్డి కాలనీలోని ప్రైవేట్  భవనంలో నిర్వహిస్తున్న బీసీ బాయ్స్  కాలేజీ హాస్టల్ ను సందర్శించారు. 

హాస్టల్ లో 350 మంది స్టూడెంట్స్  ఉన్నా రూమ్స్, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంకటేశ్ యాదవ్, నర్సింలు, నరేందర్, శివాజీ, శ్రవణ్, రవితేజ, నవీన్, నవీన్ గౌడ్, సోఫి ఉమర్  హుస్సేన్  పాల్గొన్నారు.