డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి : డెస్క్ జర్నలిస్ట్ అసోసియేషన్

డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి : డెస్క్ జర్నలిస్ట్ అసోసియేషన్

మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు: జీవో 252తో డెస్క్​ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని డెస్క్​ జర్నలిస్ట్​ అసోసియేషన్​ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్, డీపీఆర్వో ఆఫీస్ లో డెస్క్​ జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మాదిరిగానే డెస్క్​ జర్నలిస్టులకు అక్రిడిటేషన్​ కార్డులను జారీ చేయాలని డిమాండ్​ చేశారు. తిరుపతయ్య గౌడ్, ఉమాకాంత్, సాయికుమార్, వెంకటేశ్, శ్రీనివాసులు, జమ్మన్న, నవీన్​ కుమార్, జావెద్, రవికుమార్, ప్రదీప్​  పాల్గొన్నారు.

వనపర్తి టౌన్: ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 252 ను సవరించాలని టీయూడబ్ల్యూజేహెచ్ 143 జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్ రావు డిమాండ్​ చేశారు. శనివారం కలెక్టరేట్​ ఎదుట వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 252జీవోతో రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. జీవో నం.239 ప్రకారం అక్రిడిటేషన్  కార్డులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 

డెస్క్  జర్నలిస్టులను వేరు చేస్తూ మీడియా కార్డు పేరుతో విభజించడం సరైంది కాదన్నారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ యాదయ్య, డీపీఆర్వో సీతారాం నాయక్ కు వినతిపత్రం అందజేశారు. నగేశ్, మోడాల చంద్రశేఖర్, శ్రీనివాస యాదవ్, రాము,  నరసింహారెడ్డి, జానీ, రమేశ్, భాను ప్రసాద్, సతీశ్  పాల్గొన్నారు.