ChiruVenky: 'మన శంకరవరప్రసాద్ గారు' పూనకాలు లోడింగ్.. చిరు వెంకీ మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్!

ChiruVenky: 'మన శంకరవరప్రసాద్ గారు' పూనకాలు లోడింగ్.. చిరు వెంకీ మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ సందడే వేరు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' (MSG). బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకమైన ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.  లేటెస్ట్ గా ఈ చిత్రం నుండి  విడుదలైన 'మెగా-విక్టరీ మాస్ సాంగ్' ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.

ఒకే వేదికపై ఇద్దరు దిగ్గజాలు!

ఈ సినిమాలోని అతిపెద్ద ఆకర్షణ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి స్టెప్పులేయడం. టాలీవుడ్‌లో దశాబ్దాలుగా వెలుగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే పాటలో కనిపించబోతుండటం చారిత్రాత్మక ఘట్టంగా మారుతోంది. అనిల్ రావిపూడి తన గత చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'లో వెంకటేష్‌ను వెరైటీగా చూపించగా, ఈ సినిమాలో మెగాస్టార్‌తో కలిసి ఆయన చేసే రచ్చ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో, దాదాపు 500 మంది డ్యాన్సర్ల మధ్య ఈ పాటను చిత్రీకరించారు. "కేవలం దర్శకుడిగానే కాకుండా, ఒక ప్రేక్షకుడిలా ఆ ఇద్దరి ఆటపాట చూసి మైమరిచిపోయాను" అంటూ అనిల్ రావిపూడి చేసిన పోస్ట్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది.

మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ మ్యాజిక్

ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మీసాల పిల్ల', 'శశిరేఖ' పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలిచి సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ఇప్పుడు రాబోయే ఈ 'మెగా-విక్టరీ' సాంగ్‌ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నారు. పొలకి విజయ్ కొరియోగ్రఫీలో ఈ పాట మాస్ ఆడియన్స్‌కు ఐ-ఫీస్ట్‌లా ఉండబోతోంది.

ALSO READ : ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘మోగ్లీ’..

ఎన్.ఐ.ఏ ఆఫీసర్‌గా మెగాస్టార్

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఒక శక్తివంతమైన ఎన్.ఐ.ఏ (NIA) ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ , ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయి. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ లో అదరగొట్టనున్నారు.  చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరిన్ థ్రెసా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంక్రాంతి రేసులో 'మన శంకరవరప్రసాద్ గారు'

సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వండర్ మూవీని జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. సంక్రాంతి అంటేనే మెగాస్టార్ అడ్డా అని, ఈ సినిమాతో ఆయన మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, 'తగ్గేదే లే' అన్నట్లుగా మెగాస్టార్ , విక్టరీ వెంకటేష్ కలిసి థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమైపోయారు. డిసెంబర్ 30న రాబోయే ఫుల్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.