సర్పంచు లు ప్రజలకు అందుబాటులో ఉండాలి : ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డి

 సర్పంచు లు ప్రజలకు అందుబాటులో ఉండాలి : ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డి

దేవరకొండ, వెలుగు: కొత్తగా గెలిచిన సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతిచ్చిన సర్పంచుల గెలుపు, ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కాంగ్రెస్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన సభలో స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్ నేతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  దేవరకొండ నియోజకవర్గంలో  231 పంచాయతీలకు 185 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలవడం ప్రజా పాలనకు నిదర్శనమన్నారు. 

 ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. రానున్న మూడేళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తిచేసి దేవరకొండను సస్యశ్యామలం చేసి తీరుతుందన్నారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇదే హవా కొనసాగించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నూతన సర్పంచులు, వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.