వోకల్ ఫర్ లోకల్ మరింత బలోపేతం చేయాలి: మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ

వోకల్ ఫర్ లోకల్ మరింత బలోపేతం చేయాలి: మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ

ప్రతి నెలా చివరి ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమంలో  ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ ఆదివారం (డిసెంబర్ 28న) ఈ ఏడాది చివరి మన్ కీ బాత్,129వ మన్ కీ బాత్‌  కార్యక్రమంలో దేశ ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. 

2025 సంవత్సరంలో దేశం సాధించిన విజయ క్షణాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌, సైనిక విజయాన్ని దేశవ్యాప్త దేశభక్తిని పెంచిన ఘటనగా ప్రధాని ప్రశంసించారు.

భారత్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో చూపిన ధైర్యం, స్వదేశీ ఆయుధ సంపత్తి, టెక్నాలజీ ఉపయోగం ద్వారా సాధించిన విజయాలను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తో దేశం ఉగ్రవాదాన్ని రూపుమాపే నిర్ణయాన్ని చాటిందన్నారు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు.. మారుతున్న భారత్ బలాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.

గిర్ అడవుల్లో ఆసియాటిక్ సింహాల సంఖ్య పెరుగుదల, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలను కూడా మోదీ ప్రస్తావించారు. వోకల్ ఫర్ లోకల్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.